"వీడేంటి కొత్తగా చెప్తున్నాడు" అనుకుంటున్నారా..మరంతే మరి..ఎప్పుడో మన అమ్మమ్మ ఇంట్లోనో లేక నానమ్మ ఇంట్లోనో చూసుంటాము...ఇప్పుడు సినిమాలలోనో లేక (దిక్కుమాలిన) టీవీ సీరియల్స్ లోనో చుస్తున్నాం...నాదీ, నా కెమేరాదీ అద్రుష్టం బాగుండి మనకిలా దొరికింది...
ఒక నానమ్మ ఇంట్లో...

11 Comments:
బావుంది.
ఏమనుకోకపోతే ఒక చిన్న మాట. ఆ గిన్నెలు లేకుండా తియ్యాల్సింది ఫోటో.
సహజత్వం కోసం వాటిని అలాగే ఉంచి తీసానండీ...
అవుననుకోండి. అయితే ఇలాంటి అరుదైన దృశ్యాలని ఇంకొంచెం అందంగా గుర్తుంచుకుంటే బాగుంటుందేమోనని. బహుశః ముందు వైపు నుండి తీసి ఉంటే తోట అలంకారాలేమైనా కనిపించేవేమో? సాధారణంగా ఒక వైపైనా కుంకుమ బొట్లూ అవి ఉంటాయి.
ఆ వాతావరణం nostalgic గా ఉంది. అందుకని ఇలా గుర్తుకొచ్చిన విషయాలు రాస్తున్నాను.
phOtO బావుంది.
thank u అండీ లలిత గారూ...
చాలా బాగుందండి.మీరే వుద్దేస్యం తో తీసారో గాని నావి చాలా జ్ఞాపకాలు తట్టిలేపిందీ ఫొటో.అన్నట్టు మీ నానమ్మ గారి ఇల్లు గోదావరి జిల్లాల్లో ఏదన్నా పల్లెటూరా?ఎందుకంటే మా ఇల్లు అలానే వుంటుంది.పెంకుటిల్లు,పసుప్పుపూల చెట్లు,తులసి కోట...ఇప్పుడు నాకు మా ఇంటికి వెళ్ళాలని వుంది.
హ హ హ రాధికా గారూ..
నా బాధ అంతా అదే కదా...నేను పల్లెటూరులో పుట్టలెదనే కదా..
నాకు అవన్నీ చూస్తే కుల్లు వచ్చేస్తుందండి చిన్నప్పటినుంచి అవన్నీ మిస్స్ అయ్యానని..
ఈ ఫొటో లో ఉన్నది మా ఫ్రెండు వాళ్ళ నానమ్మ ఇళ్ళు..నాకెంతో నచ్చేసి తెగ ఫొటో లు తీసేసాను ఊరంతా...
పవన్,
హృదయ పూర్వక ధన్యవాదములు.నాకు మా నానమ్మ ఇల్లు గుర్తు తెప్పించి ఇబ్బంది పెట్టావు. ఇప్పుడే పెట్టె సర్ధుకుని వేళ్ళి పొవాలి అని వుంది.
అహా ఈ ఫోటో చాలా బాగుంది.తెలుగు వికీలో తులసి వ్యాసం కోసం సరిగ్గా ఇలాంటి బొమ్మ కోసమే వెతుకుతున్నా. మీరు అనుమతి ఇస్తే నేను వికీపీడియాలో పెడతాను. అందుకు మీరు దీన్ని GFDL లేదా క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్ లైసెన్సుల్లో ఏదో ఒక దాన్లో విడుదల చెయ్యాలి. ఉపయోగించిన చోటల్లా మీకు గుర్తింపు ఇవ్వబడుతుంది
నాకేం అభ్యంతరం లేదు...కానీ.."GFDL లేదా క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్ లైసెన్సుల"...గురించి నాకస్సలు తెలియదు...మరెలా..???..
http://creativecommons.org/licenses/by-sa/3.0/
http://en.wikipedia.org/wiki/Wikipedia:Text_of_the_GNU_Free_Documentation_License
థాంక్స్, మీరీ లింకులు చూసి ఫలానా లైసెన్సు కింద ఈ బొమ్మను విడుదల చేస్తున్నానని ఒక ముక్క ఇక్కడ రాయండి చాలు
ఆ తులసి కోటకి పక్కనున్న గిన్నెని "తప్పేలా" లేక "తపేలా" అంటారు. నాన్‌స్టిక్కు గిన్నెల ఉధృతంలో ఇవికూడా తులసి కోటల్లాగానే మాయమైపోతున్నై. అందుకని, లలిత గారి అబ్జెక్షన్ అలా ఉండగా, ఆ గిన్నె కూడా బొమ్మలో ఉండటం సముచితమే అనిపించింది నాకు.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home