Instagram Feed

June 26, 2007

పవన్ గాడు వచ్చేసాడు..చాలా రోజుల తరువాత..
ఈసారి నేను పోస్టు చేసే ఫొటోలు మీ అందరికీ చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయని ఆశిస్తున్నాను..
పైన కనపడుతున్న ఫొటో ని చూస్తుంటే "పైభాగం ఢిల్లీ లోని అమర్ జవాన్ స్తూపం లాగా ఉంది..కింద భాగం చూస్తే తెలుగులో రాసి ఉంది " అని ఆశ్చర్యపోతున్నారా... ఇంతకీ మనం అసలు కధలోకి వెళితే ...ఆ కనపడుతున్న తుపాకీ, దాని మీద టొపీ అమర్ జవాన్ స్తూపమే..కానీ స్థలం పశ్చిమ గోదావరి జిల్లా లోని తాడేపల్లి గుడెం సమీపంలో మాధవరం గ్రామం.. ఈ ఊరికి ఇంకొక పేరు ఉంది.."మిళిటరీ మాధవరం"..ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఊర్లోని ప్రతి ఇంటి నుంచీ ఒకరు మిళిటరీ లో ఉంటారు..ఇది ఇప్పటి ఆచారం కాదు..మొదటి ప్రపంచ యుధ్ధం నుంచీ వస్తున్నది..ఇలా తెలియగానే నాకు వళ్ళు పులకరించిపోయి తెగ ఫొటోలు తీసాను..అవన్నీ ఒక్కటొక్కటిగా మీతో పంచుకుంటాను...(ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇలాంటి స్మారక స్థూపాలు మన దెశంలో కేవలం మూడే ఉన్నాయట)