Instagram Feed

March 26, 2007

"జో అచ్యుతానంద జో జో ముకుందా..."
నేను ఈ ఫొటో తీసేసరికి ఈ చంటి లేగదూడ వయసెంతో తెలుసా...కేవలం 8 గంటలు మాత్రమే...మాంచి నిద్ర లో ఉంది..అయినా నేను ఫొటో తీస్తున్నానని తెల్సి కళ్ళు తెరిచి ఇలా పోజు ఇచ్చింది...

March 13, 2007

"అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది ఫొటోగ్రాఫికి అనర్హం"

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం...అని శ్రీశ్రీ గారు అన్నదానిని నాకు తోచినవిధంగా,నాకు సరిపోయేలా అన్వయించుకున్నాను..

March 10, 2007

" Bird Photography "అని Photography పెద్దల దగ్గర విని అదెదో చాలా తేలిక అనుకున్నాను..కాని ఒకసారి ట్రై చేస్తెగాని తెలియలేదు ఎంత కష్టమొ,ఎంత ఓర్పు కావాలో,..ఈ బంగారు పిచ్చుక నన్ను మూడు చెరువుల నీళ్ళు తాగించింది ఒక్క పోజు ఇవ్వటానికి..ఆఖరికి ఇలా చిక్కింది ...
"వన్స్ మోర్"..అని పిచ్చుక బాషలో అడిగింది మరి.,.ఇంకొక ఫొటో తీసేదాకా ఊర్కోలేదు ...ఒకటే కిచ కిచ..

March 06, 2007

ఉడతా ఉడతా ఊచ్చీ..
పాపం యీ ఉడత..మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ..ఎంత కష్టపడుతుందో చూడండి..